రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తీవ్ర అస్వస్థత ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పారామెడికల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రెండు బృందాలు ప్రత్యేక వైద్యులు హుటాహుటిన ఆయన గదికి చేరుకుని, మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు సమాచారం. పుతిన్ ఆరోగ్యంపై అనుమానం వ్యక్తం చేస్తూ మీడియాతో కథనాలు వస్తున్న క్రమంలోనే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ రష్యా టెలిగ్రాం ఛానల్ జనరల్ ఎస్వీఆర్ తెలిపింది. తీవ్ర వికారంగా ఉందని పుతిన్ తన సహాయకులకు చెప్పారు. దీంతో విధుల్లో ఉన్న పారామెడికల్ సిబ్బంది 20 నిమిషాల పాటు అధ్యక్షుడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అయినా పరిస్థితి కుదటపడలేదు. దీంతో ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారు. చికిత్స అనంతరం పుతిన్ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది.













