3, 10 తేదీల్లో యూఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్…
అమెరికాలో ఉన్నత విద్యావకాశాలపై యూఎస్ కాన్సులేట్ వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లను నిర్వహించనున్నది. సెప్టెంబర్ 3న మాస్టర్స్, పీహెచ్డీ, ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్ వర్చువల్ ఫెయిర్‌ను, బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాముల్లో అవగాహనకు సెప్టెంబరు 10న అండర్ గ్రాడ్యుయేట్ వర్చువల్ ఫెయిర్‌ను చేపట్టనున్నది. విద్యార్థులు https://bit.ly/EdUSAFair22EmbWeb లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ వర్గాలు వెల్లడిరచాయి. ఆన్లైన్లో జరిగే ఈ సమావేశాల్లో వందకుపైగా అమెరికన్ వర్సిటీలు, కాలేజీలు పాల్గొంటాయి. అమెరికా చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇందులో పాల్గొనవచ్చు. దీనికి ఫీజు లేదు. అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.













