అమెరికా వెళ్లాలనుకునేవారికి తీపి కబురు.. పర్యాటక వీసాలకు
తొలిసారి అమెరికా వెళ్లాలనుకునేవారికి తీపి కబురు. పర్యాటక వీసా ఇంటర్వ్యూ తేదీల స్టాట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. జనవరి తరువాత పర్యాటక వీసా ( బి1 / బి2) స్లాట్లు విడుదలవుతాయని అమెరికా ఆశావహులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోని అన్ని పనిదినాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా స్లాట్లను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో పరిమిత సంఖ్యలో విడుదలైనట్లు పలువురు కన్సల్టెంట్లు తెలిపారు.
కరోనా నేపథ్యంలో 2020 మార్చి మూడో వారం నుంచి వీసా ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. అత్యవసరమైన వారికి ప్రాధాన్య క్రమంలో వీసా ప్రక్రియ నిర్వహించింది. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో పర్యాటక వీసాల పునరుద్ధరణ విషయంలో ఇంటర్వ్యూలను మినహాయించింది. గడువు ముగిసి 48 నెలల్లోపు అయివారి వీసాల పునరుద్ధరణకు వీలుగా డ్రాప్‌బాక్స్ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం విద్యార్థి వీసాల హడావుడి తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో తొలిసారి అమెరికా వెళ్లేవారికి ప్రాధాన్యమిస్తామని ఢల్లీిలోని అమెరికా రాయబార కార్యాలయం గతంలోనే ప్రకటిచింది.













