ప్రధాని మోదీకి అమెరికన్ సింగర్ మద్దతు
మణిపుర్ అంశంలో ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్ ప్రముఖ సింగర్ మేరీ మిల్బెన్ మద్దతు పలికింది. భారత ప్రధాని ఈశాన్య రాష్ట్ర ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటారని వ్యాఖ్యానించింది. పార్లమెంట్లో మోదీ ప్రకటన ముగిసిన కొద్దిసేపటికే మిల్బెన్ ఈ వ్యాఖ్యలు చేసింది. నిజం ఏమిటంటే భారత ప్రజలకు తమ నేతపై విశ్వాసం ఉంది. మణిపుర్, భారత్కు చెందిన మహిళలు, కుమార్తెలకు న్యాయం అందుతుంది. ప్రధాని మోదీ ఎప్పుడూ మీ స్వేచ్ఛ కోసమే పోరాడుతుంటారు. విపక్షాలు ఎలాంటి విషయం లేకుండా రాద్దాంతం చేస్తుంటాయి. విదేశాల్లో తమ దేశాన్ని అగౌరవపరచడం నాయకత్వం కాదు. కానీ నిజం ఎల్లప్పుడూ ప్రజలు స్వేచ్చగా ఉండేలా చూస్తుందని అని అన్నారు.













