జపాన్ కు అమెరికా వత్తాసు…

ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించే విషయంలో జపాన్‍కు అమెరికా వత్తాసు పలికింది. ఒలింపిక్స్ కు సంబంధించి తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వైట్‍హౌస్ కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. క్రీడల్లో పాల్గొనే వారి ఆరోగ్య పరిరక్షణే తమ కీలక ప్రాధాన్యత అని జపాన్ ప్రభుత్వం చెబుతోంది. ఒలింపిక్స్ కోసం అమెరికా అథ్లెట్లు సంసిద్ధులవడానికి బైడెన్ మద్దతిస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్‍లో జపాన్ ప్రధాని యోషిండె సుగా అమెరికాలో పర్యటించినపుడు ఒలింపిక్స్ కు మద్దతునిస్తూ వైట్‍హౌస్ ఒక ప్రకటన జారీ చేసింది. జపాన్‍లో ప్రస్తుతం నాల్గవ దశ కరోనా విజృంభిస్తుండడంతో ఆ దేశానికి ప్రయాణాలు చేయవద్దంటూ అమెరికా విదేశాంగ శాఖ సూచనలు జారీ చేసింది. ఆ సూచనల్లో ఒలింపిక్స్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఈ ప్రయాణ సూచనల వల్ల ఒలింపిక్స్ ఎలాంటి ప్రభావం వుండదని జపాన్ అధికారులు పేర్కొంటున్నారు.