టీకా విషయంలో ప్రపంచ దేశాలకు… అమెరికా

తమ వద్ద అవసరానికంటే అధికంగా మిగిలిపోయిన 8 కోట్ల డోసుల టీకాలను ప్రపంచ దేశాలకు పంచటానికి అమెరికా ముందుకొచ్చింది. తొలి విడతగా 2.5 కోట్ల డోసుల్లో 1.9 కోట్ల డోసులను దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు అందజేస్తారు. వీటిలో 60 లక్షల డోసులను లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలకు, 70 లక్షల టీకాలను దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు పంపి, ఆఫ్రికాకు 50 లక్షల డోసులు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. మిగిలిన 60 లక్షల టీకాలను కొవిడ్ అధికంగా ఉన్న, తీవ్రంగా దెబ్బతిన్న దేశాలైన భారత్, మెక్సికోలతో పాటు, తమ పొరుగుదేశం కెనడా, మిత్రదేశం దక్షిణ కొరియాలకు నేరుగా పంపిస్తామని బైడెన్ తెలిపారు.