సముద్రంలో కూలిన అమెరికా మిలటరీ హెలికాప్టర్
అమెరికాకు చెందిన మిలటరీ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నుంచి టేకాఫ్ అయిన ఆ హెలికాప్టర్ శాన్ డియాగో దగ్గర సముద్రంలో కూలినట్టు యూఎస్ నేవీ వెల్లడించింది. హెలికాప్టర్‌తో పాటు ఆందులోని సిబ్బంది కోసం గాలిస్తున్నట్లు చెప్పింది. ఎప్పటిలాగే ఫ్లైట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న సమయంలో శాన్ డియాగోకు 60 నాటికల్ మైళ్ల దూరంలో హెలికాప్టర్ కూలినట్లు పసిఫిక్ ఫ్లీట్ ట్వీట్ చేసింది. నేవీ ఎయిర్ బృందాలు హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో గాలింపు చేపట్టామని నేవీ తెలిపింది.













