తమ పౌరులకు అమెరికా వార్నింగ్…భారత్ నుంచి త్వరగా

భారత్‍పై కరోనా విరుచుకుపడుతున్నది. ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఉండటం మంచిదికాదని, ఇప్పటికే ఇండియాలో ఉన్నవారు వీలైనంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలని కోరింది. అలాగే భారత్‍కు వెళ్లకూడదని అమెరికన్ ప్రజలకు సూచించింది. అమెరికాకు ప్రతిరోజు భారత్ నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని, యూరప్ మీదుగా అమెరికా ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటి ద్వారా దేశానికి వెంటనే చేరుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ లెవల్ 4 ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్ 4 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసిది. అమెరికన్ పౌరులు కొన్ని రోజులు వరకు భారత్‍కు వెళ్లకపోవడం మంచిదని సలహా ఇచ్చింది.