అమెరికా వీసా.. మరింత వేగంగా
వివిధ నగరాల్లో కొత్త కాన్సులేట్ కార్యాలయాల ఏర్పాటుతో అమెరికా వీసా దరఖాస్తుల పరిశీలన మరింత వేగవంతం కానున్నదని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గ్రాసెట్టీ అన్నారు. వీసా ప్రక్రియకు సంబంధించి వెయిటింగ్ టైమ్, బ్యాక్‌లాగ్‌ల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు. ఎరిక్ గ్రాసెట్టీ న్యూఢీల్లీలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయంలో సిబ్బందిని పెంచాం. బెంగళూరు, అహ్మదాబాద్‌లో కొత్త కాన్సులేట్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఇదంతా వీసా బ్యాక్లాగ్ సంఖ్యను తగ్గించేందుకు దోహదపడుతుంది అని అన్నారు.













