అమెరికా నటి డేనిస్ రిచర్డ్ పై కాల్పులు
అమెరికాకు చెందిన నటి డేనిస్ రిచర్డ్, ఆమె భర్త ప్రయాణిస్తున్న కారుపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. లాస్ ఏంజిల్స్ స్టూడియో బయట కారును పార్కింగ్ చేసేందుకు నటి రిచర్డ్, ఆరోన్‌లు ప్రయత్నిస్తున్నారు. వెనుకవైపు నుంచి వస్తున్న మరో కారు పార్కింగ్‌కు ప్రయత్నిస్తున్నాడు. రిచర్డ్ కారును కాదని ముందుకు రావడానికి ప్రయత్నించాడు. అయితే వీరు అందుకు సమ్మతించారు. అయినా సహనం కోల్పోయిన వ్యక్తి కారు వెనుకభాగంలో కాల్పులు జరిపాడు. దీంతో షాకు గురైన నటి రిచర్డ్ కేకలు వేసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.













