ఉక్రెయిన్ పై రష్యా మరోసారి
బెల్గోరోడ్‌పై దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడిలో చాలా నివాస సముదాయాలు దెబ్బతిన్నాయి. రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాల్లోని జనావాసాలపై భారీ స్థాయిలో ఇవి దాడులు జరిపాయి. బెల్గోరోడ్‌పై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు రష్యా ప్రకటించింది. చెక్‌ల తయారైన వాంపైర్ రాకెట్లలో ఓక్లా క్షిపణులను అమర్చి తమపై దాడులకు పాల్పడ్డారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. కీవ్ లోని గగనతల రక్షణ వ్యవస్తలు 21 రష్యా డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఖర్కివ్‌లో ఒక హోటల్, అపార్ట్మెంటు, దుకాణాలు, కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత రెండ్రోజుల నుంచి ఇరు దేశాల మధ్య దాడులు ముమ్మరమయ్యాయి. మౌలిక సదుపాయాలను దెబ్బ తీయడానికి ప్రయోగించిన డ్రోన్ వల్ల ఒకచోట మంటలు ఎగసిపడ్డాయి.













