టోక్యో పారా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
టోక్యోలో మరో క్రీడా సంరంభం షురూ అయింది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్ క్రీడలు వైభవంగా జరిగాయి. ఈ ప్రారంభోత్స వేడుకల్లో భారత బృందం కూడా పాల్గొంది. దివ్యాంగ అథ్లెట్ టేక్ చంద్ వీల్ చైర్లో కూర్చుని త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందానికి ఈ మార్చ్ పాస్ట్‌లో నేతృత్వం వహించాడు. సెప్టెంబరు 5 వరకు జరిగే టోక్యో పారాలింపిక్స్ లో 163 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. మొత్తం 22 క్రీడాంశాలకు చెందిన 540 ఈవెంట్లు నిర్వహించనున్నారు. భారత్ నుంచి 54 మంది బరిలో దిగుతున్నారు. గత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాల సహా భారత్ 4 పతకాలు గెలిచింది. ఈసారి భారత అథ్లెట్లు 9 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.













