రష్యన్ లకు పుతిన్ ప్రభుత్వం క్షమాపణ
ముందూ వెనుకా ఆలోచించకుండా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వం ఎట్టకేలకు రష్యన్ల ఉద్యమానికి తలొగ్గింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల 18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మధ్య వయస్కులకు రష్యా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీనిపై విద్యార్థులు, వృద్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పొరపాటు జరిగిందని రష్యా ప్రభుత్వం రష్యన్లకు క్షమాపణ చెప్పింది. వోల్గాగ్రాడ్లో 63 ఏండ్ల మాజీ సైనికుడిని ప్రభుత్వం సైనిక శిక్షణా కేంద్రానికి తరలిచింది. మధుమేహ వ్యాధిగ్రస్తుడైన వృద్ధుడిని యుద్ధంలో పాల్గొనేలా ఒత్తిడి చేయటంపై ప్రజలు తిరగబడ్డారు. అదే ప్రాంతానికి చెందిన 58 ఏండ్ల పాఠశాల డైరెక్టర్‌కు కూడా సైన్యంలో చేరాలని ఆదేశాలు వచ్చాయి. అతడికి సైనిక వ్యవహారాల్లో ఏ మాత్రం అనుభవం లేకపోవటంతో ఈ ఆదేశాలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.













