అమెరికాలో తొలిసారిగా.. మనిషిలో
పక్షులకు మాత్రమే పరిమితమైన బర్డ్‌ప్లూ తొలిసారి మనిషిలో కనిపించింది. అమెరికాలో కొలరాడోలోని ఒక కోళ్లఫారంలో పనిచేసే వ్యక్తికి హెచ్5 ఎన్1 బర్డ్ ఫ్లూ సోకినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. ఈ వ్యక్తి పనిచేసే కోళ్లఫారంలో కోళ్లకు బర్డ్‌ప్లూ సోకి ఉంటుందని, వీటిని మూకుమ్మడిగా అంతం చేసే పని ఇతనికి అప్పగించారని, ఆ సమయంలో ఏవియన్ ఫ్లూ వైరస్ సోకి ఉంటుంది. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి యాంటీ వైరల్ ఔషధం ఒసెల్టా మివిర్తో చికిత్స అందిస్తున్నామన్నారు. పక్షుల్లో ఇన్ఫ్లూయంజా వైరస్ వల్ల బర్డ్‌ప్లూ వ్యాపిస్తుంది. వాటిని ఐసోలేట్ చేసి చంపడం ద్వారా ఇతర పక్షులకు సోకకుండా జాగ్రత్త పడతారు.













