టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 130 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. 70 మంది వరకు గాయపడ్డారు. ఫెడ్ఎక్స్ ట్రక్కు అదుపు తప్పి బారియర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ క్రమంలో దాని వెనుకాలే వస్తున్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో ఒకదానికిందకు దూసుకెళ్లాయి. తీవ్ర మంచుతుఫాను కారణంగా వాహనాలు పట్టుకోల్పోడం వల్లే ప్రమాదం జరిగిందని ఫోర్ట్‌వర్త్ పోలీస్ అధికారి డేనియల్ తెలిపారు. దీంతో రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే ప్రమాదంలో మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వేగంగా వాహనాలు ఢీకొట్టుకోవడంతో వాహనాలు భారీగా దెబ్బతిన్నాయి. పలువురు అందులోనే చిక్కుకోవడంతో అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ రెస్య్యూ పరికరాలను వినియోగించి వారిని బయటకు తీశారు. గాయపడ్డ సుమారు 36 మందిని హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉంది. అయితే ప్రమాదానికి కారణం మంచువర్షమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు తుఫాను కారణంగా టెక్సాస్‌లో షెర్లీ ముగ్గురు, డల్లాస్‌లో ముగ్గురు మృతి చెందారు. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా టెక్సాస్‌లో మంచు తీవ్రత మరింత పెరుగుతుందని నేషనల్ వెదర్ సర్వీసెస్ పేర్కొంది.













