ఉక్రెయిన్ నుంచి స్వస్థలాలకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు చేరుకోవడం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన 13 మంది విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. మూడో రోజు ఆరో విడతగా ఆరుగురు ఏపీ విద్యార్థులు ఢల్లీి చేరుకున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనరు (పిఆర్సి) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుయాపాలతో పాటు ఇతరేతర సహాయ సహకారాలు అందించారు. విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏపీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు విడతల వారీ స్వదేశానికి చేరుకుంటున్నారు. మూడో రోజే ఏడో విడతో ఇద్దరు విద్యార్థులు మంబాయికి చేరుకున్నారు. ఎనిమిదో విడతలో 10 మంది విద్యార్థులు, తొమ్మిదో విడతలో ఒక విద్యార్థి ఢిల్లీ చేరుకున్నారు.













