తాలిబన్ ల మరో సంచలన నిర్ణయం
అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అనేక ఉద్యోగాల్లో మహిళలకు ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించాల్సిందేనని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ (విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మహిళా విద్యార్థులు విశ్వ విద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.













