విదేశీ విద్యార్థులకు అమెరికా శుభవార్త.. ఏడాది ముందే
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు శుభవార్త. ఐ-20 ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి ఏడాది ముందే ఎఫ్, ఎం విద్యార్థి వీసాలు ఇవ్వనున్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది. అయితే ఏడాది ముందే విద్యార్థి వీసా వచ్చినా కూడా విద్యా సంవత్సరం ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే అమెరికాకు రావడానికి వీలవుతుందని పేర్కొంది. ఈ ప్రకటన ద్వారా అమెరికాలోని విశ్వవిద్యాలయాలు 12-14 నెలల ముందే ఐ-20 ఫామ్లు మంజూరు చేయడంతో పాటు అంగీకరించే వెసులుబాటు కలుగుతుంది. ఏడాది ముందే వీసా దరఖాస్తు అవకాశం ఇవ్వడం వల్ల సరిపడా సమయం ఉంటుంది.













