ఉద్యోగులకు భారీ ఆఫర్… పిల్లల్ని కంటే 62 లక్షలు
తమ దేశంలో పడిపోతున్న జనన రేటును పెంచేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ బూయంగ్ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. పిల్లల్ని కన్న ప్రతిసారి రూ.62.54 లక్షలు (100 మిలియన్ల కొరియన్ వాన్లు ) చెల్లిస్తామని తెలిపింది. 2021లో 70 మంది పిల్లలకు జన్మినిచ్చిన ఉద్యోగులూ రూ.43.77 లక్షలు చెల్లించాలని యోచిస్తున్నది. ముగ్గురు పిల్లలున్న ఉద్యోగులకు రూ.1.86 కోట్ల నగదు లేదా అద్దె ఇంటి సదుపాయాన్ని కల్పించాలని అనుకుంటున్నది. ఈ ఆఫర్లు ఆడ, మగ ఉద్యోగులిద్దరికీ వరిస్తాయంది. 2022లో ప్రపంచంలో అతి తక్కువ సంతానోత్పత్తి రేటు దక్షిణ కొరియాలో నమోదైంది.













