అమెరికాలో ప్రమాదం… పాపులర్ సింగర్ దుర్మరణం
కేరళకు చెందిన ప్రసిద్ధ కర్ణాటక, హిందూస్థానీ సంగీతకారుడు జయరాజ్ నారాయణన్ శాస్త్రీయ కళాకారుడిగా మంచి గుర్తింపు ఉంది. అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో శాస్త్రీయ, భక్తిగీతాలను పాడారు. కేరళలో పుట్టి పెరిగిన జయరాజ్ పలు ప్రపంచ వేదికలపై భారతీయ సంగీత గొప్పదనాన్ని చాటిచెప్పారు. అమెరికాలో క్లాసికల్, సెమిక్లాసికల్ అనేక కన్సర్ట్లు నిర్వహించారు. ఈ క్రమంలో చిన్న వయస్సులోనే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. జయరాజ్‌కు భార్య, మేఘన, గౌరీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.













