అమెరికా ఫెడరల్ ఏజెన్సీ పై…హెచ్ 1బీ వ్యాజ్యం ఉపసంహరణ

హెచ్ 1బీ వర్కింగ్ వీసాకు సంబంధించి అమెరికా సిటిజెన్‍షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‍సిఐఎస్)కు వ్యతిరేకంగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెరికాలోని ఏడు వాణిజ్య సంస్థల కూటమి ఉపసంహరించుకుంది. విదేశీ వర్కింగ్ వీసాలపై ఇదివరకు ఉన్న విధానాలనే అనుసరించి న్యాయం చేస్తామని ఫెడరల్ ఏజెన్సీ అంగీకరించడంతో ఈ ఉపసంహరణ జరిగింది. అక్టోబర్ 1 తరువాత ఈ వీసాలను తిరస్కరిస్తామని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించడాన్ని సవాలూ చేస్తూ ఏడు వాణిజ్య సంస్థల కూటమి తరపున మార్చిలో వ్యాజం దాఖలైంది. యూఎస్‍సీఐఎస్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని ఆ కంపెనీలు వాదించాయి. అయితే పొరపాట్లను సరిదిద్ది.. న్యాయం చేసేందుకు యూఎస్‍సీఐఎస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు తమ వ్యాజ్యాని ఉపసంహరించుకున్నాయి.