అమెరికాలో రైలు ప్రమాదం
అమెరికాలో ఒక రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. చికాగో నుంచి సీటెల్కు ప్రయాణిస్తున్న ఎంఫైర్ బిల్డర్ రైలు ఉత్తర మోంటానా వద్ద ప్రమాదానికి గురయింది. కెనడా సరిహద్దుల్లోని జోప్లిన్ పట్టణానికి సమీపంలోని మారుమూల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎనిమిది బోగీలు ఉన్న ఈ రైలులో 141 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికాలో రైలు వ్యవస్థ నిధుల కొరత ఎదుర్కొంటుంది. దీంతో ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2018లో దక్షిణ కరోలినా వద్ద రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. భద్రతా పర్యవేక్షణ లోపంతనే ఈ ప్రమాదం జరిగింది.













