అమెరికా శాస్త్రవేత్తలు… వైద్యరంగంలో ఓ అద్భుతం
అమెరికా శాస్త్రవేత్తలు వైద్యరంగంలో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పందుల అవయవాలను మనుషులకు అమర్చే అవకాశాలపై ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. పది రక్తకణాల్లో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్లే వీటి కిడ్నీలు మానవ శరరీంలో ఇమడలేకపోతున్నాయని తాజాగా గుర్తించారు. దీన్ని అధిగమించేందుకు జన్యు సరవణ చేసిన ఓ పందిపై ప్రయోగం చేశారు. దాని రక్తకణాల్లోని చక్కెరను తొలగించారు. ఆ తర్వాత దాని కిడ్నీని ఓ బ్రెయిన్‌డెడ్ మనిషి దేహానికి అమర్చారు. శరీరం వెలుపలే ఈ కిడ్నీని అమర్చి దాని పనితీరును పరిశీలించారు. రెండు రోజుల పాటు సాగిన ఈ పరిశీలనలో ఓ సాధారణ కిడ్నీ చేసే పన్నులన్నింటినీ ఇది సక్రమంగా నిర్వర్తించడాన్ని గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ కూడా ఈ కిడ్నీని ఆమోదించిందని, దీంతో దశాబ్దాల పరిశోధనల్లో ఓ కీలక ముందడుగు పడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.













