పాకిస్థాన్ లో హిందూ యువతికి అరుదైన గౌరవం

పాకిస్తాన్‍లో తొలిసారి ఓ హిందూ యువతికి అరుదైన గౌరవం దక్కింది. పాకిస్థాన్ అసిస్టెంట్ కమిషనర్‍గా సనా రామ్‍చంద్ ఎంపికైంది. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు కూడా. పాకిస్తాన్ సెంట్రల్ సుపీరియర్ సర్వీస్ (సీఎస్‍ఎస్)లో ఉత్తీర్ణత సాధించిన సనా రామ్‍చంద్.. అనంతరం పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (పాస్)లో ఎంపికయ్యారు. భారత దేశంలో ఐఏఎస్‍తో సమానం. పాకిస్తాన్ సీఎస్‍ఎస్ రాత పరీక్షలో 18,553 మంది అభ్యర్థులు హాజరవ్వగా అందులో 221 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో మెరిట్ సాధించిన సనా రామ్‍చందర్ ఆ దేశ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‍కు ఎంపికయ్యారు. పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‍కు ఎంపికవడం పట్ల సనా రామ్‍చంద్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదన్నారు. చిన్నతనం నుంచి ప్రతి అంశంలో విజయాన్ని కోరుకుంటూ సాధిస్తూ వచ్చానని, ఇప్పుడు ఇది సాధించానని తెలిపారు.