ఆరోపణలు చేయడమే అమెరికా పని
ఉత్తరకొరియా తమకు ఆయుధాలు సరఫరా చేస్తోందంటూ అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. అవన్నీ వదంతులేనని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ అన్నారు. అందరిపై ఆరోపణలు చేయడమే అమెరికా పని. ఈ వదంతులపై నేను స్పందించను అని తెలిపారు. గత వారం ఉత్తరకొరియా 1000 కంటెయినర్లలో రష్యాకు సైనిక పరికరాలను, ఆయుధాలను సరఫరా చేసిందంటూ ఇందుకు సంబంధించిన చిత్రాలను అమెరికా విడుదల చేసింది. ఇందుకు బదులుగా రష్యా నుంచి అత్యాధునిక సాంకేతికతను ఉత్తర కొరియా అధినేత కిమ్ కోరుకుంటున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు.













