ఉక్రెయిన్ పై రష్యా మెరుపుదాడి… గంటలో 17 సార్లు
ఉక్రెయిన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని నిత్యం రష్యా మెరుపు దాడులకు పాల్పడుతున్నది. తాజాగా జపోరిఝయా నగరంపై రష్యా మెరుపుదాడులు చేసింది. జపోరిఝయాలోని ఇంధన సదుపాయాలు లక్ష్యంగా రష్యన్ సేవలు మిస్సైల్లతో విరుచుకుపడ్డాయి. కేవలం గంట వ్యవధిలో 17 సార్లు ఉక్రెయిన్లోని ఇంధన కేంద్రాలపై క్షిపణుల వర్షం కురిపించాయి. ఉక్రెయిన్`రష్యా యుద్ధం మొదలైన దగ్గరి నుంచి రష్యా గంట వ్యవధిలో 17 సార్లు మిస్సైల్ దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారని జపోరిరిaయా సిటీ కౌన్సిల్ సెక్రెటరీ అనతోలి కుర్టీవ్ తెలిపారు.













