నాటోలో చేరితే మీకూ ఉక్రెయిన్ గతే
ఉక్రెయిన్పై సైనిక చర్య క్రమంలోనే నాటోలో చేరవద్దని స్వీడన్, ఫిన్లాండ్లను రష్యా హెచ్చరించింది. బహిరంగంగా, దౌత్య మార్గాల ద్వారా ఆ రెండు దేశాలను హెచ్చరించినట్టు రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా రaఖరోవా వెల్లడిరచారు. స్వీడన్, ఫిన్లాండ్లకు బాగా తెలుసు. దీని గురించి వారు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నాటాలో చేరితే ఏమవుతుందో వారికి పూసగుచ్చినట్టు చెప్పాం అని మారియా తెలిపారు. నాటో సభ్యత్వం తీసుకునే విషయమై ఫిన్లాండ్ పార్లమెంటులో చర్చ జరుగుతున్న క్రమంలో రష్యా ఈ హెచ్చరికలను జారీ చేయడం గమనార్హం.













