ఫేస్‌బుక్‌కు రోహింగ్యాల షాక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు రోహింగ్యా శరణార్థులు షాక్ ఇచ్చారు. ఫేస్బుక్ పూర్వరూపం మెటా కంపెనీపై 150 మిలియన్ డాలర్ల భారీ నష్టపరిహారం కోరుతూ దావా వేశారు. యూకే, యూఎస్‌లో రోహింగ్యా శరణార్థులు ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. మయన్నార్‌లో తమకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం ఫేస్బుక్ వేదికగా జరిగిందని వారు ఆరోపించారు. తమ వర్గానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడంలో ఎఫ్బీ కీలక పాత్ర పోషించిందని, తమపై వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్బుక్ విఫలమైదని రోహింగ్యాలు పేర్కొన్నారు.













