బ్రిటన్ ప్రధాని రేసులో తొలిరౌండ్.. అగ్రస్థానంలో రిషి సునక్
బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వారసుడి ఎంపిక ప్రక్రియలో తొలి రౌండ్లో భారత సంతతికి చెందిన ఎంపీ రిషి సునక్ అత్యధిక ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. క్సనర్వేటివ్ పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలిరౌండ్లో ఏకంగా రిషి సునన్కు 88 ఓట్లు రావడం విశేషం. పెద్దగా ఓట్లు సాధించలేకపోయినా ఇటీవలే కొత్తగా ఛాన్సలర్‌గా నియమితుడైన నాధిమ్ జహాని, మాజీ మంత్రి జెర్మీ హంట్ ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ రేసులో ఉండాలంటే కనీసం 30 ఓట్లు సాధించాల్సి ఉండగా వారి ఆ మైలురాయి చేరుకోలేకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్నట్టయింది.
విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ 50 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడు దశల్లో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో తొలి రౌండ్ చాలా ప్రాథమిక దశ. ఇప్పటికిప్పుడు రిష్ సునక్ అంతా కలిస్తొందని చెప్పలేం. కాకపోతే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ఉత్సాహాన్నిస్తుంది. ప్రధాని రేసులో మార్డాంట్, లిజ్ ట్రస్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే ఈ ఇద్దరి మధ్య పోటీ రిషి సునక్‌కు కలిసి రావొచ్చు కన్సర్వేటివ్ పార్టీ తరపున రేసులో ఉన్న వారిలో సెప్టెంబర్ 5న జరిగే తుది పోటీలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అతడే తదుపరి బ్రిటన్ ప్రధానిగా ప్రకటిస్తారు.













