అప్పుడు ఒబామా.. ఇప్పుడు రిషి సునాక్
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన 42 ఏళ్ల రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీ తరపున బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. భారత మూలాలున్న వ్యక్తి. శ్వేతేతర జాతీయుడు. 200 ఏళ్ల తరువాత యువ హిందూ ప్రధానిగా ఎన్నిక కావడం విశేషం. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ ప్రధానిగా అత్యున్నత స్థానంలో కూర్చున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పుడు రిషి సునాక్ కూడా ఒబామా మాదిరి శ్వేతేతర జాతీయుడని ఒబామా నాటి అనుభూతిని ఆలయ ప్రతినిధి సంజయ్ చందరణ పంచుకున్నారు.
ఇది తమకు ఒబామా మూమెంట్ అని హిందూ దేవాలయ కమిటీ అభివర్ణించింది. లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలో సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. రిషి తాతా రామ్‌దాస్ సునాక్ దీన్ని నిర్మించారు. రిషి తండ్రి యాస్ కూడా 1971 నుంచి ఆలయ ట్రస్టీగా కొనసాగారు. ఆ ఆలయంతో రిషి కుటుబానికి అనుబంధం కొనసాగుతోంది. ఆయన నిత్యం దానిని సందర్శిస్తుంటారు. గత జులైలో కూడా రిషి సునాక్ అక్కడకు వెళ్లారు.













