అగ్రస్థానంలో కొనసాగుతున్న రుషి సునాక్
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న మాజీ మంత్రి రుషి సునాక్ మరింత ఆధిక్యం సాధించారు. కన్సర్వేటివ్ పార్టీ ఎంపీల తాజా ఓటింగులో 115 ఓట్లతో నలుగురు అభ్యర్థుల్లో అగ్రస్థానంలో ఆయన ఉన్నారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్ 82 ఓట్లతో రెండో స్థానంలో, విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ 71 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. కెమిబడెనోచ్కు 58 ఓట్లు వచ్చాయి. తదుపరి విడత ఓటింగ్ మంగళవారం జరగనుంది. దానిలో మరింత వడపోత జరుగుతుంది. గురువారం నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. ఆ తర్వాత 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రదానిని ఎన్నుకుంటారు.













