బ్రిటీష్ ప్రధాని బరిలో.. భారత సంతతి వ్యక్తి
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యేందుకు పలువురు ఎంపీలు పోటీ పడుతున్నారు. ఈ రేసులో భారతీయ ములాలున్న వ్యక్తుల సంఖ్య రెండుకు పెరిగింది. సుయెలా బ్రవెర్మన్ ఇప్పటికే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోగా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ కూడా రంగంలో దిగుతున్నట్లు వెల్లడించారు. బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా, కన్జర్వేటివ్ పార్టీ నేతగా పోటీ చేస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రధాని పదవి విశ్వసనీయతను పునరుద్ధరిద్దాం. ఏకతాటిపై నిలుపుదాం అంటూ రిషి ట్వీట్ చేశారు.













