ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు : పుతిన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుభవజ్ఞుడైన నాయకుడని జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. మాస్కోలో కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍తో చర్చిండం అంత సులభం కాదని అన్నారు.. ప్రతీ విషయంపైనా ఆయనకు అవగాహన ఉందని పేర్కొన్నారు. తాను సాధించాల్సిందేంటో బైడెన్‍కు బాగా తెలుసు అని అన్నారు. ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు అని పుతిన్ పొడిగారు.