కిమ్ కు లిమోజిన్ కారును పంపిన పుతిన్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ విలాసవంతమైన లిమోజిన్ కారును కానుకగా పంపారు. కిమ్ వ్యక్తిగత అవసరాల కోసం అధ్యక్షుడు పుతిన్ దీనిని పంపించినట్లు రష్యా ప్రతినిధి పెష్కోవ్ తెలిపారు. ఇటీవల రష్యాలో పర్యటన సమయంలో అధ్యక్షుడు పుతిన్ ఈ లిమోజిన్‌ను ఆయనకు చూపించారని గుర్తు చేశారు. ఈ కానుకను కిమ్ సోదరి కిమ్ యో జొంగ్, మరో ఉన్నతాధికారి స్వీకరించి, పుతిన్‌కు కిమ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. రష్యా, ఉత్తరకొరియాల మధ్య బంధం బలోపేతం అవుతోందనేందుకు ఇది తాజా ఉదాహరణ అని పరిశీలకులు అంటున్నారు. పుతిన్ చర్య ఐక్యరాజ్యసమితి ఆంక్షల ఉల్లంఘన కిందికి వస్తుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.













