యూఏఈ పర్యటనకు ప్రధాని మోదీ!
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. జర్మనీలో ఈ నెల 26-28 తేదీల మధ్య జీ-7 దేశాల సదస్సు జరుగనున్నది. దీనికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని యూఏఈ కూడా వెళ్లనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ జందాల్ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. పలు దేశాలు భారత రాయబారులకు సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. దశాబ్దాలుగా గల్ఫ్‌తో ఉన్న సత్సంబంధాలు బీజేపీ నేతల వ్యాఖ్యతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల ఆగ్రహాన్ని చల్లార్చి తిరిగి దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని యూఏఈ వెళ్తున్నట్టు విశేషకులు అభిప్రాయపడుతున్నారు.













