గూగుల్ లో అత్యధిక మంది వెతికింది ఇదే!

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది గూగుల్‍ని అడిగిన ప్రశ్నలు.. ఓ మహిళను ఎలా కొట్టాలి?.. భార్యను ఎలా అదుపులో ఉంచాలని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు 16.50 కోట్ల మంది గూగుల్ లో సమాధానాలు వెతికారట. అంతకు ముందు ఏడాది 31 శాతం పెరిగిన ఇలాంటి దారుణమైన సెర్చ్లు 2020లో ఏకంగా 106 శాతం పెరిగాయట. ఈ వివరాలను ఇటీవల టేలర్ అండ్ ఫ్రాన్సిస్ వెల్లడించింది. నూజిల్యాండ్‍లోని ఒటాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ కేటరినా స్టాండిష్ ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు కారణం అప్పటి లాక్‍డౌన్ పరిస్థితులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గృహ హింస కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కరోనా భయం, లాక్‍డౌన్‍తో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోవడం.. ఈ రెండూ మనుషుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపి ఉంటాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.