అమెరికాలో ఓ వ్యక్తికి … 707 ఏళ్ల జైలు శిక్ష
అమెరికాలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మాథ్యూ జక్ర్జెవ్స్కీ అనే కామాంధునికి ఏకంగా 707 ఏళ్ల జైలు శిక్షపడింది. కాలిఫోర్నియాకు చెందిన అతను పిల్లల బాగోగులు చూసుకునే నానీగా పని చేసేవాడు. ఆ క్రమంలో 2014`19 మధ్య 2 నుంచి 12 ఏళ్ల వయసున్న కనీసం 16 మంది పిల్లలను లైంగికంగా వేధించాడు. మరో బాలునికి అశ్లీల చిత్రాలు చూపించాడు. తన కొడుకును మాథ్యూ అభ్యంతకర రీతిలో తాకుతూ ఇబ్బంది పెట్టాడంటూ 2019లో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విదేశాలకు పారిపోతుండగా అతన్ని అరెస్టు చేశారు. 17 మంది అమాయకుల బాల్యాన్ని మాథ్యూ ఛిద్రం చేశాడని తీర్పు సందర్బంగా జడ్జి అన్నారు.













