మనకు మరో ముప్పు… బయటపడిన మరో వైరస్
ఇప్పటికే కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న మనకు మరో ముప్పు కూడా పొంచి ఉంది. ఆ ముప్పు పేరు మంకీపాక్స్. ఇప్పటిప్పుడు కాకపోయిన జాగ్రత్తగా ఉండకపోతే, భవిష్యత్లో ఈ కొత్త ముప్పు విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, తాజాగా యుకెలోని నార్త్ వేల్స్లో మంకీపాక్స్ యొక్క రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది ఎక్కడ నుంచి వారికి సంక్రమించి ఉండొచ్చు. వీరి వలన మరెవరికైనా ముప్పు ఉందా అనేది పరిశోధనలు చేస్తున్నారు. అయితే రోగుల ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఈ వ్యాది సంక్రమణ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు.













