అమెరికా కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో వింత ఘటన జరిగింది. 43 ఏళ్ల కుమారుడి నీలిచిత్రాలు కలెక్షన్ పారేసినందుకు తల్లిదండ్రులు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని మిచిగాన్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో తల్లిదండ్రులు తమ కుమారుడికి 30,441 డాలర్లు ( సుమారు రూ.22.37 లక్షలు) చెల్లించాల్సిందిగా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి పాల్ మలోని తీర్పిచ్చారు.
అమెరికాలోని మిచిగాన్కు చెందిన డేవివ్ వర్కింగ్ (43) అనే వ్యక్తి ఇటీవల భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలు తల్లిదండ్రుల వద్ద ఉందామని వచ్చాడు. ఒక పది నెలల తర్వాత తిరిగి వెళ్లిపోవాలనేది అతని ప్లాన్. అయితే అలా తల్లిదండ్రుల వద్ద ఉండగా, తాను ఏళ్ల తరబడి సేకరించిన పోర్నోగ్రఫీ కలెక్షన్ దాచిన అట్టపెట్టెలు అతినికి కనిపించలేదు. అవెక్కడున్నాయా? అని అరా తీయగా తల్లిదండ్రులు తామే వాటిని పారేశామని చెప్పారు. దీంతో అతని గుండె పగిలినంత పనైంది. ఆగ్రహంతో ఉగిపోయిన డేవిడ్ తల్లిదండ్రులపై కోర్టులో పిటిషన్ వేశాడు. 8 నెలల క్రితం ఈ కేసు నమోదైంది. తాను ఏళ్ల తరబడి సేకరించిన పోర్నో గ్రఫీ కలెక్షన్ ధర 29 వేల డాలర్లు (సుమారు రూ.21 లక్షల) వరకూ ఉంటుందని కోర్టుకు డేవిడ్ చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు తీర్పు వెల్లడించింది. నగదు తల్లిదండ్రులు డేవిడ్‌కు 30 వేల డాలర్లు (రూ.22.37 లక్షలు) నష్టపరిహారం చెల్లించాల్సిందేనని జడ్జి ఆదేశించారు.













