ఈ హెల్మెట్ ధర రూ.37 లక్షలు మాత్రమే!

అమెరికాలో ఓ అద్భుతమైన హెల్మెట్ అందుబాటులోకి రానుంది. కెర్నెల్ అనే సంస్థ తయారు చేస్తున్న ఈ హెల్మెట్ ధర రూ.37 లక్షలు మాత్రమే. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మీ మెదడును చదివేస్తుంది. సెన్సర్ల నెట్లు ఉన్న ఈ హెల్మెట్‍ను పెట్టుకుంటే మెదడులో విద్యుత్ ప్రకంపనలు, రక్త ప్రవాహాన్ని వాయువేగంతో కొలవడంతో పాటు విశ్లేషిస్తుంది. ఈ పరిజ్ఞానం చాలా ఏళ్ల నుంచి అందుబాటులో ఉంది. కానీ, ఒక గది అంత పరిమాణంలో ఉండే ఖరీదైన యంత్రాల ద్వారా టెస్టులు చేస్తేనే ఇవన్నీ తెలుస్తాయి. రోగులు కూడా గంటల తరబడి ఆస్పత్రుల్లో ఉండాల్సి ఉంటుంది. కెర్నెల్ కంపెనీ తయారు చేసే హెల్మెట్ అందుబాటులోకి వస్తే ఈ బాధలేవీ ఉండవు. సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ హెల్మెట్‍ను ఎవరైనా ధరించవచ్చని, దీన్ని రూపొందించడానికి ఐదేళ్లు శ్రమించిన బ్రియాన్ జాన్స్ తెలిపారు. ఈ హెల్మెట్ల తయారీకి ఆయన ఇప్పటి వరకు దాదాపు రూ.815 కోట్లు ఖర్చు పెట్టారు.