అమెరికా, బ్రిటన్ అధినేతలు ఒకరికొకరు.. బహుమతులు

అమెరికా, బ్రిటన్ అధినేతలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. జీ 7 సదస్సులో భాగంగా జో బైడెన్ 6 వేల డాలర్ల (సుమారు రూ.4.4 లక్షలు) విలువైన సైకిల్‍ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‍కు బహుమతిగా ఇచ్చారు. మెషిన్ వాడకుండా ఇది చేత్తో చేసిన సైకిల్ కావడం విశేషం. సైకిల్ బ్రిటన్ జెండాలో ఉండేబ్లూ, రెడ్ కలర్స్లో ఉంది. దీనిపై ఇద్దరు దేశాధినేతలు సంతకాలు చేశారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని జాన్సన్ కూడా 19వ శతాబ్దంలో బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఫెడ్రిక్ డగ్లస్ ఫొటోను ఫ్రేమ్ కట్టించి బిడెన్‍కు కానుకగా ఇచ్చారు.