సింగపూర్ లో భారతీయుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
బ్రిటిష్ మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఓ భారతీయుడికి సింగపూర్ న్యాయస్థానం 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇరుగుల ఈశ్వర రెడ్డి అనే యువకుడు 2022లో సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద తన స్నేహితుల కోసం వేచిచూస్తున్న బ్రిటిష్ మహిళను కలిశాడు. అప్పటికే ఆమె మత్తులో ఉంది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఈశ్వర రెడ్డి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. భారత్‌కు చెందిన ఈశ్వర రెడ్డికి 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు బెత్తం దెబ్బలు తినాలని కోర్టు ఆదేశించింది.













