తప్పనిసరి అయితేనే ఆ దేశంలో .. లేకపోతే వెంటనే వెళ్లిపోండి
ఉక్రెయిన్పై దాడికి రష్యా సర్వసన్నద్ధంగా ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్రెయిన్లో ఉంటున్న భారతీయులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి అయితేనే ఉక్రెయిన్లో ఉండాలని, లేకపోతే వెంటనే ఆ దేశాన్ని వీడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. విద్యార్థులు సహా భారతీయులు అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది. ముఖ్యంగా, విద్యార్థులు స్టూడెంట్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండాలని, తాజా సమాచారం కోసం భారత ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించింది. ఉక్రెయిన్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, ఏ క్షణాన అయినా రష్యా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది.













