భారతీయ వ్యాపారి దాతృత్వం.. రూ.2.5 కోట్ల విరాళం
యూఏఈలోని జైళ్లలో మగ్గుతున్న 900 మంది ఖైదీల విడుదల కోసం దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త, దాత ఒకరు ఈ ఏడాది ప్రారంభం నుంచి 10 లక్షల దినారాలు (సుమారు రూ.2.5 కోట్లు) విరాళంగా అందజేశారు. ప్యూర్ గోల్డ్ జులెల్లర్స్ యజమాని అయిన 66 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్ 900 మంది ఖైదీల విడుదల కోసం 10 లక్షల దినారాలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులకు విరాళంగా అందజేశారు. పవిత్ర రంజాన్ మాసం రానున్న నేపథ్యంలో మానవత్వానికి, క్షమాగుణానికి, దాతృత్వానికి ఇది సందేశమని ఫిరోజ్ మర్చెంట్ కార్యాలలయం ఒక ప్రకటనలో తెలిపింది. అజ్మన్‌లోని 495 మంది ఖైదీలు, పుజైరాలోని 179 మంది, దుబాయ్‌లోని 121 మంది, అల్ ఖుమెయిన్లోని 69, రస్ అల్ ఖైమాలోని 28 మంది ఖైదీల విడుదల కోసం ఫిరోజ్ మర్కెంట్ ఆర్థిక సహాయాన్ని అందచేశారు.













