రష్యా దాడిలో భారతీయ విద్యార్థి మృతి
ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఖార్కీవ్లో జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్‌గా గుర్తించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సదరు విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొంది. ఖార్వివ్లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడిరది. అయితే అవి గురి తప్పి నవీన్ ఉంటున్న నివాస ప్రాంతంపై పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉక్రెయిన్‌లో ఉంటున్న మిగిలిన భారత విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.













