చైనాకు భారత్ చెక్
శ్రీలంకలోని మూడు దీవుల్లో జలవిద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. జాఫ్నా ఉత్తర ప్రాంతంలోని నైనాతీవు, డెల్ట్ఫ్ లేదా నెడుంతీవు, అనలైతీవు దీవులు భారతదేశంలోని తమిళనాడుకు దగ్గర ఉన్నాయి. ఈ దీవుల్లో జలవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కాంట్రాక్టును గతేడాది జనవరిలో చైనాకు చెందిన సైనోసార్-ఎటెక్విన్ సంస్థలకు శ్రీలంక అప్పగించింది. దీనిపై భారతదేశం అభ్యంతరం తెలపడంతో థర్డ్ పార్టీ నుంచి భద్రతా కారణాలు అంటూ గతేడాదే చైనా కంపెనీ ఆ కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. కాగా, ఏడు సభ్యదేశాల బింస్టెక్ సదస్సులో పాల్గొనేందుకు శ్రీలంక వచ్చిన భారత విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేశారు.













