భారత్ కు ఆహ్వానం పంపుతాం : జర్మనీ
జి-7 సమావేశాలకు భారత్‌కు ఆహ్వానం పంపిస్తున్నట్లు జర్మనీ ఒక ప్రకటలో తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో (26`28 తేదీలు) బవేరియన్ ఆల్ప్స్లో జరుగనున్న జి-7 దేశాల సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌తో రష్యా సైనికచర్యలపై భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ జి-7 సమావేశాలకు జర్మనీ ప్రధాని మోదీని ఆహ్వానించడం లేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను జర్మనీ తోసిపుచ్చింది. త్వరలోనే భారత్‌కు ఆహ్వానం అందనుందని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జరగనున్న జి-7 సదస్సుకు సెనిగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను జర్మనీ ఆహ్వానించింది.













