పాక్ ప్రధానికి ఊరట.. ఏప్రిల్ 3 వరకూ
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు గొప్ప ఊరట లభించింది. ఏప్రిల్ 3 వరకూ పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని ఇమ్రాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో పార్లమెంట్‌ను వాయిదా వేయడం ఆసక్తికర పరిణామం. ఈ మూడు రోజులు పాక్ ప్రధాని ఇమ్రాన్ చాలా కీలకమైన రోజులని, ఆయన కుర్చీని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. ఇక అవిశ్వాసంపై ఏప్రిల్ 3న చర్చ జరిగే అవకాశాలున్నాయి.
342 మంది సభ్యులున్న పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ పీటీఐకి 155 మంది సభ్యులున్నారు. పీఎంఎల్ క్యూ సహా ఇతరుల మద్దతులో ఆయనకు మద్దతిస్తున్న వారి సంఖ్య 164కు చేరింది. వాస్తవానికి మ్యాజిక్ నెంబర్ 172. ప్రతిపక్ష పీఎంఎల్ఎన్కు 84, పీపీపీ 56, ఎంఎంఏకు 15 మంది, ఇతరులు 22 మంది ఉన్నారు. వీరందరి బలం 117. మ్యాజిక్ నెంబర్‌ను మించి ప్రతిపక్షాల వద్ద బలముంది.













