అమెరికాలో ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువతి మృతి చెందింది. నారాయణగూడ ప్రాంతానికి చెందిన ప్రతీక్ష కున్వర్ అమెరికాలోని కన్సాస్‌లో ఉన్న విచిత స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ బిజినెస్ అనాలిసిస్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ఈ నెల 16న ఆమె, సోదరి ప్రియ, డ్రైవర్ వరుణ్‌తో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రతీక్ష అక్కడిక్కడే మృతి చెందగా, మిగతా ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతీక్ష భౌతిక కాయాన్ని నగరానికి తరలించేందుకు విదేశాంగ శాఖ కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు వారి ఇంటికి చేరుకున్న ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ తెలిపారు.













