డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం
ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ పిల్లారిశెట్టి రఘురామ్ ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో (ఆర్సీపీఎస్జీ) అంతర్జాతీయ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రస్తుతం కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రఘురామ్ 2026 వరకు ఈ బాధ్యతలు నిర్వరిస్తారు. లండన్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఐర్లాండ్‌లోని నాలుగు సర్జికల్ రాయల్ కాలేజీల నుంచి ఫెలోషిప్ పొందిన అతికొద్ది మందిలో రఘురామ్ ఒకరు. గత రెండు దశాబ్దాలుగా సర్జన్లకు ఆయన అందించిన సహకారాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఆర్సీపీఎస్జీ అంతర్జాతీయ డైరెక్టర్ హనీ ఎటీబీ పేర్కొన్నారు. రఘురామ్ గతంలో 2010-2020 వరకు ఐదేండ్ల పాటు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు అంతర్జాతీయ శస్త్రచికిత్స సలహాదారుగా పనిచేశారు.













